సైంధవభవనం లో సూర్యగ్రహణం - Purchase Links
Grab your copy now !Country | Paperback | E-Book |
---|---|---|
![]() | ![]() | ![]() |
INDIA | AMAZON.IN | CHADUVU APP |
APPLE BOOKS | ||
KOBO | ||
EVERAND | ||
SMASHWORDS |
కృష్ణుడు భగవద్గీత చెప్పి ఉండకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగేది కాదా?”
“పడిన శిక్ష చేసిన తప్పుకి కర్మ ఫలితం అయితే, మరి చేసిన తప్పు దేనికి ఖర్మ ఫలితం?”
“పదవి, భక్తి, ధనం, దానం, బలం, బలగం ఇలా ప్రతి పోలిక లో రావణుడు రాముని కన్నా ఎక్కువ అయినప్పుడు మరి రాముడు ఎలా గెలిచాడు?”
“కర్ణుని పుట్టుక కుంతి కోరికా లేక కౌరవుల చావుకా?”
“ఒకడు ఎదుటివాడిని కావాలని గెలిపిస్తే, గెలిపించినవాడు గెలిచినట్టా? ఓడించినవాడు గెలిచినట్టా?”
“కృష్ణుడు యుద్ధం ఆపగలడు, కాని ఆపలేదు. రాముడు యుద్ధం ఆపాలనుకున్నాడు కానీ తప్పలేదు. కథలకి ముగింపు యుద్ధమేనా, గాధలకు ముగింపు రోదనలేనా?”
“తప్పు ఒప్పు అనే పదాలకి నిజంగా అద్వైత అర్థాలు ఉన్నాయా? నిజం అనేది మనం చూసేదా? వినేదా? జరిగేదా? లేక నమ్మేదా?”
“బలిచక్రవర్తి మంచివాడయినప్పుడు విష్ణువు ఎందుకు కాలికింద ఉంచి తొక్కాడు?”
“మంచి కోసం చెడు చేసేవాడు గొప్పా? చెడు కోసం మంచి చేసేవాడు గొప్పా?”
“నిజం,.. చెప్పడానికి బాగుంటుందా? వినడానికి బాగుంటుందా?”
కారడవి మధ్యనున్న సైంధవభవనం అనే జైలుకు కొత్తజైలరు వచ్చాడు. జైలును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉన్న అతనికి వచ్చీరాగానే ఫారెస్ట్ ఆఫీసర్ నుండి వచ్చిన ఫోన్ కాల్ తో మొదలయిన ఒక సమస్య, ఇద్దరు ఖైదీల జీవితాలతో ఎలా ముడిపడింది? ఆ ఖైదీలు అసలు ఎందుకు మాట్లాడుకోరు? ఎందుకు గొడవపడుతున్నారు? వారిని కలపక తప్పని పరిస్థితిని జైలరు ఎలా అధిగమించాడు?
జైలుకు రాక ముంది జరిగిన ఒక సంఘటన ఈ ఖైదీల జీవితాలను ఎలా మార్చేసింది? మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఆ ఇద్దరు మాట్లాడుకోవడం మొదలు పెడితే బయటపడే నిజాలు ఊహకు కూడా అందకపోతే?
ఇదంతా చాలా దెగ్గరగా వీక్షించిన ఆ జైలు గోడ ఉండబట్టలేక మనకి చెప్పే కథే ఈ ‘సైంధవభవనం లో సూర్యగ్రహణం’.